దేశవ్యాప్తంగా

దేశవ్యాప్తంగా స్పెషల్ ఆడిట్ డ్రైవ్‌లు

Published on: 27-10-2025

దేశవ్యాప్తంగా నవంబర్ 10 నుండి పది రోజులపాటు 'స్పెషల్ ఆడిట్ డ్రైవ్' నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. ఆడిట్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం, ఫలితాలను విశ్లేషించడంపై సిబ్బందిని సన్నద్ధం చేసేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 'చింతన్ శిబిర్-2025' కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. పన్నుల సంబంధిత జవాబుదారీతనం పెంచడంలో ఆడిట్ కీలక పాత్ర పోషిస్తుందని రవి అగర్వాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎం. అనిల్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Sponsored