telangana indira mahilashakti women petrol bunks districts

ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల పెట్రోలు బంకులు.. ‘ఇందిరా మహిళాశక్తి’కు శ్రీకారం

Published on: 📅 04 Mar 2026, 05:16 AM
Reporter: 🖊 Suresh Reddy

తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందిరా మహిళాశక్తి పథకం కింద ఈ కేంద్రాలను నెలకొల్పనున్నారు. జిల్లా యంత్రాంగం అవసరమైన భూమిని 30 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ ప్రతిపాదనలు మిషన్ ఫర్ ఎలిమినేషన్ అఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ కు పంపాలి. ఏఎల్‌ఎఫ్, టీఎల్‌ఎఫ్ సంఘాలు నిధులు సమకూర్చనున్నాయి. ఆయిల్ సంస్థలు, లీగల్ మెట్రాలజీ శాఖల అనుమతులు తీసుకోవాలి. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం.

Sponsored