టి20

టి20 వరల్డ్ కప్ డే-12: పాకిస్తాన్ సూపర్ ఎయిట్‌లోకి, భారత్ అజేయంగా ముందుకు

Published on: 📅 19 Feb 2026, 07:34

టి20 వరల్డ్ కప్ 12వ రోజు ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూఏఈపై సులభ విజయంతో గ్రూప్ దశను పరిపూర్ణంగా ముగించింది. పాకిస్తాన్-నమీబియా మ్యాచ్‌లో ఓపెనర్ సహిబ్జాదా ఫర్హాన్ అజేయ శతకం సాధించడంతో పాకిస్తాన్ భారీ స్కోరు చేసి సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించింది. స్పిన్నర్లు ఉస్మాన్ తారిఖ్, షాదాబ్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో నమీబియాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ గెలిచి టోర్నీలో అజేయంగా కొనసాగింది. శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడారు.

Sponsored