ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల్లో మార్పులు వచ్చినా సమాజం వాటికి అలవాటు పడుతుందని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మ్యాన్అ న్నారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిశ్రమ విప్లవం సమయంలో కూడా ఇలాంటి భయాలు వ్యక్తమయ్యాయని, కానీ తర్వాత కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. భారత్‌లో 30 ఏళ్లలోపు 50 కోట్ల మంది యువత ఉన్న నేపథ్యంలో ఉద్యోగాల అంశం కీలకమని చెప్పారు. భవిష్యత్తులో AI టూల్స్‌పై పట్టు, మార్పులకు అనుగుణంగా మారే నైపుణ్యం, జట్టు సహకారం ముఖ్యమని ఆయన సూచించారు.