pawan kalyan usthad bhagat singh early release thaman update

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముందస్తు విడుదల?.. సంగీత దర్శకుడిపై చర్చ

Published on: 📅 04 Mar 2026, 05:28 PM
Reporter: 🖊 Suresh Reddy

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రకటించిన మార్చి 26 తేదీ కంటే వారం ముందే విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా నేపథ్య సంగీతం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్‌ను తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.

Sponsored