new governors appointed for several states shiv pratap shukla for telangana

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు… తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లా

Published on: 📅 06 Mar 2026, 08:50 AM
Reporter: 🖊 PopBites

కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్‌గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లాను నియమించింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఇక నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్‌ను నియమించింది. అలాగే పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఆర్.ఎన్. రవిని నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు త్వరలో అమల్లోకి రానున్నాయి.

Sponsored