క్రికెట్ రూల్స్‌ను నిర్ణయించే MCC కొన్ని ముఖ్యమైన మార్పులను ప్రకటించింది. రనౌట్ లేదా స్టంపింగ్ సమయంలో బాల్‌పై పూర్తి నియంత్రణ ఉండాలని స్పష్టం చేసింది. టెస్ట్ క్రికెట్లో రోజు చివరి ఓవర్లో వికెట్ పడినా ఆ ఓవర్‌ను పూర్తిగా కొనసాగించాల్సిందిగా నిర్ణయించింది. అలాగే బౌలర్ బాల్ విడుదల చేసిన తర్వాత కీపర్ గ్లోవ్స్ స్టంప్స్ వెనక ఉంటే సరిపోతుందని తెలిపింది. ఈ మార్పులు అక్టోబర్ 2026 నుంచి అమల్లోకి రానున్నాయి