internet shutdown in iran for over 130 hours

ఇరాన్‌లో 130 గంటలుగా ఇంటర్నెట్ బ్లాక్

Published on: 📅 06 Mar 2026, 10:52 AM
Reporter: 🖊 PopBites

ఇజ్రాయెల్–అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో 130 గంటలకు పైగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కేవలం 1 శాతం మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉందని ఇంటర్నెట్ మానిటరింగ్ సంస్థ నెట్ బ్లాక్స్ వెల్లడించింది. గ్లోబల్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి టెలికమ్యూనికేషన్ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. భద్రతా కారణాల వల్ల అంతర్గత సమాచారం బయటకు లీక్ కాకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Sponsored