ఇండియా–పాకిస్థాన్

ఇండియా–పాకిస్థాన్ మహా పోరు ఈరోజే.. T20 WCలో మరో హై వోల్టేజ్ మ్యాచ్

Published on: 📅 15 Feb 2026, 07:52

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మహా పోరుకు వేళయింది. T20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ చరిత్రలో పాక్‌తో ఆడిన 8 మ్యాచుల్లో 7 సార్లు భారత్ విజయం సాధించింది. అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరోసారి గెలవాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, సూర్యకుమార్ రాణిస్తే, బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి మెరుస్తే విజయం మనదేననే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. చక్ దే ఇండియా

Sponsored