బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్మన్ తారిక్ రహ్మాన్ ఫిబ్రవరి 17న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే ముంబైలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఆయన హాజరు కావడం కష్టమేనని వర్గాలు చెబుతున్నాయి. ఢాకాలోని పార్లమెంట్ భవనంలో జరిగే ఈ వేడుకకు దక్షిణాసియా దేశాల దృష్టి సారించింది. భారత్-బంగ్లాదేశ్ సంబంధాల నేపథ్యంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యం సంతరించుకుంది.
బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి మోదీకి ఆహ్వానం.. ఫిబ్రవరి 17న తారిక్ రహ్మాన్ ప్రమాణం
Published on: 📅 15 Feb 2026, 08:03