heavy rush at tirumala 18hour wait for darshan

తిరుమలలో భక్తుల రద్దీ… దర్శనానికి 18 గంటలు

Published on: 📅 06 Mar 2026, 11:30 AM
Reporter: 🖊 PopBites

తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వర స్వామి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం మొత్తం 59,194 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 25,295 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Sponsored