guttapalli sai prasad to take charge as andhra pradesh chief secretary

శనివారం సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న గుట్టపల్లి సాయి ప్రసాద్

Published on: 📅 27 Feb 2026, 01:21 PM
Reporter: 🖊

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా గుట్టపల్లి సాయి ప్రసాద్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. **అమరావతి**లోని ఏపీ సచివాలయంలో ఉదయం 11.33 గంటలకు అధికారికంగా బాధ్యతలు చేపడతారు. 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన, వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా సేవలు ప్రారంభించి, కర్నూల్ కలెక్టర్‌, పలు విద్యుత్‌ సంస్థల సీఎండీగా, కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అనుభవజ్ఞుడైన పరిపాలనాధికారిగా ఆయన నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది

Sponsored