govt issues professional tax notices to private schools

ప్రైవేటు స్కూళ్లకు ప్రొఫెషనల్ ట్యాక్స్ నోటీసులు

Published on: 📅 06 Mar 2026, 10:08 AM
Reporter: 🖊 PopBites

రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. ఈ పన్ను వసూలు చేసే బాధ్యతను డీఈవోలకు అప్పగిస్తూ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 11 వేల ప్రైవేటు స్కూళ్లలో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను సేకరిస్తోంది. ఈ చర్యలతో ఫీజుల నియంత్రణకు మార్గం సుగమం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Sponsored