ap government advance pension distribution february 28

ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ… అసెంబ్లీకి సెలవు నిర్ణయం

Published on: 📅 25 Feb 2026, 07:03 AM
Reporter: 🖊

రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ఒకరోజు ముందుగానే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. మార్చి 1న ఆదివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండటంతో ఈనెల 28న గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పింఛన్లు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. పంపిణీ కార్యక్రమం సజావుగా సాగేందుకు అసెంబ్లీకి కూడా ఆ రోజు సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. 28న పింఛన్లు అందుకోలేని వారికి మార్చి 2న పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Sponsored