bank branches may be shut for up to 14 days in april 2026 check before you visit

14 రోజులు బ్యాంక్ బ్రాంచ్‌లకు బ్రేక్..! ఏప్రిల్ షెడ్యూల్ ముందే చెక్ చేసుకోండి

6

Published on: 📅 01 Apr 2026, 11:55 AM
Reporter: 🖊 Eswar Pavan

ఏప్రిల్ 2026లో బ్యాంక్ పనులు ప్లాన్ చేయకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ నెలలో వారాంతాలు, ప్రాంతీయ పండుగలు, వార్షిక ఖాతాల ముగింపు కారణంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంక్ బ్రాంచ్‌లు మొత్తం 14 రోజులు వరకు మూసివుండే అవకాశం ఉంది. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. ఏప్రిల్ 1న annual closing కారణంగా అనేక చోట్ల బ్రాంచ్ సేవలకు అంతరాయం కలగొచ్చు. ఆ తర్వాత Good Friday, రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు, అలాగే రామ్ నవమి, అంబేద్కర్ జయంతి, బిహు, విషు, తమిళ నూతన సంవత్సరం వంటి పండుగలతో వరుస సెలవులు రావచ్చు.

ముఖ్యంగా ముందుగా చెక్ చేయకుండా బ్రాంచ్‌కు వెళ్లితే తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యూపీఐ, ఏటీఎంలు, నెట్ బ్యాంకింగ్ సేవలు కొనసాగినా, చెక్ క్లియరెన్స్, లాకర్, కౌంటర్ పనులు ఆలస్యం కావచ్చు. అందుకే చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, మీ రాష్ట్రానికి సంబంధించిన హాలిడే లిస్ట్ ముందుగానే చెక్ చేసి బ్యాంక్ పనులు పూర్తి చేసుకోవడం మంచిది.

Sponsored