కేంద్ర

కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో మోసం.. జర భద్రం: తెలంగాణ పోలీస్ శాఖ

Published on: 16-10-2025

హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీస్ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ లింక్స్ పంపి, కేంద్ర ప్రభుత్వ పథకాలంటూ ప్రచారం చేస్తున్నారు. అందుకే, ప్రజలు తమ అర్హతను చెక్ చేసుకోకుండా అపరిచితులు పంపిన లింక్‌లను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచించారు. కేవలం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు.

Sponsored