ముంపు

ముంపు తప్పించిన మూడో కాలువ

Published on: 15-10-2025

విజయవాడ నగరం గుండా ప్రవహించే రెవెన్ కాలువకు ఒక ఆసక్తికర చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలనలో 1850 ప్రాంతంలో కృష్ణా నదిపై ఆనకట్టతో పాటు రెండు కాలువలు నిర్మించారు. వరదల సమయంలో ఈ కాలువల ద్వారా నీరు పొంగి నగరాన్ని ముంచెత్తేది. దీనిని గమనించిన బ్రిటిష్ ఇంజనీర్ కెప్టెన్ జోన్స్ గోర్ అదనంగా మూడో కాలువను నిర్మించి దానికి రెవెన్ కాలువ అని పేరు పెట్టారు. స్వాతంత్య్రానంతరం, 1952లో బ్యారేజీ నిర్మాణం జరిగింది. ఈ కాలువ మొత్తం పొడవు సుమారు 58 కి.మీ వరకు ఉంటుంది.

Sponsored