ఢిల్లీలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖను ఏపీ సిలికాన్ వ్యాలీగా మార్చేందుకు పునాది పడుతుంది. గూగుల్ ఈ ప్రాజెక్టులో సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.