అన్నవరం

అన్నవరం ఆళయ పరిసరాల్లో అగ్నిప్రమాదం

Published on: 26-09-2025

కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ పరిసరాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున రథగృహం పక్కన ఉన్న రాజగోపురం వద్ద మంటలు వ్యాపించాయి. వెంటనే గమనించిన భక్తులు, సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కొంతమేరకు సామగ్రి దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు స్వల్ప భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత యథావిధిగా ఆలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టారు.

Sponsored