అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వైకాపా విధ్వంసం చేసిన భవనాలను పునరుద్ధరిస్తున్నామని, 21 భవనాలు ఇప్పటికే కూల్చబడ్డాయని చెప్పారు. 90 శాతం భవనాలకు విద్యుత్, నీరు కల్పించామని వివరించారు. రాజధాని ప్రాంతంలో రహదారులు, బ్రిడ్జీలు, భవనాలు పూర్తి చేసేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. రూ. 31 వేల కోట్లు ఖర్చు పెట్టారని, 2018లో మూడేళ్లలో 80% పనులు పూర్తయినట్లు గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో అభివృద్ధి జరుగుతుందని, రైతులకు న్యాయం చేస్తామన్నారు. అమరావతి ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.