సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన కేసులు పెట్టొద్దని తేల్చి చెప్పింది. పరువు నష్టం కేసుల్లో నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని, మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించాలని సూచించింది. అరెస్టులు చేసే ముందు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని, రాజకీయ ప్రేరేపిత కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం తీసుకోవాలని తెలిపింది.