నా

నా రీఎంట్రీకి పర్‌ఫెక్ట్ మూవీ ‘మిరాయ్’.. నేను అలాంటోణ్ణి కాదు - మంచు మనోజ్

Published on: 09-09-2025

తేజ సజ్జ, మంచు మనోజ్ హీరోలుగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మిరాయ్ ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం విశాఖలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మనోజ్ భావోద్వేగంగా మాట్లాడారు. ‘‘నా రీ-ఎంట్రీకి మిరాయ్ సరైన సినిమా. బ్లాక్ స్వార్డ్ పాత్రలో నటించాను. భారీ సెట్ కూలిపోయినా నిర్మాత విశ్వప్రసాద్ రాజీపడకుండా మళ్లీ నిర్మించారు’’ అన్నారు. తేజ సజ్జ ప్రతిభను ప్రశంసిస్తూ, మిరాయ్ ఫ్రాంచైజీగా కొనసాగాలని ఆకాంక్షించారు. ‘‘పవన్ కళ్యాణ్ ఓజీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కంధపురి విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అని మనోజ్ పేర్కొన్నారు.

Sponsored