హైదరాబాద్ నారాయణగూడ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకుని మూడు సంచుల్లో దాచిన రూ.2 కోట్ల రద్దయిన కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన డీమానిటైజేషన్‌తో రూ.500, రూ.1000 నోట్లు రద్దయ్యాయి. ఇప్పటి వరకు 99.3 శాతం నోట్లు మాత్రమే తిరిగి ఆర్బీఐ చేరాయని ఆర్బీఐ తెలిపింది. అలాగే 2023లో ఉపసంహరించిన రూ.2000 నోట్లలో 98 శాతం తిరిగి రికవరీ అయ్యాయి. ఇక మిగిలిన కరెన్సీ అంతా ఇంకా మార్కెట్లోనే ఉన్నాయి. అప్పుడప్పుడు ఇలా బయటపడుతూ ఉన్నాయి.
హైదరాబాద్‌లో రద్దైన పెద్ద నోట్లు దొరికాయ్.. 3 బ్యాగుల్లో రూ.2 కోట్లు..
Published on: 09-09-2025