HYD

HYD నగరంలోని ఈ ప్రాంతంలో యూనిటీ మాల్‌.. 50 అంతస్తుల్లో టవర్‌, ప్రత్యేకతలివే..!

Published on: 12-08-2025

హైదరాబాద్ గచ్చిబౌలిలో అత్యాధునిక సౌకర్యాలతో యూనిటీ మాల్ నిర్మాణం కానుంది. 5.16 ఎకరాల స్థలంలో 50 అంతస్తుల టవర్‌ను రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.202 కోట్లు కేటాయించింది. చేనేత, హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శనకు మొదటి ఆరు అంతస్తులు కేటాయించగా.. మిగిలినవి వాణిజ్య సముదాయాలకు ఉపయోగిస్తారు. 2027 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Sponsored