మరో

మరో నాలుగు రోజులు వానలు.. ఈ జిల్లాలలో భారీ వర్షాలు. బీ అలర్ట్..

Published on: 11-08-2025

ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే అల్పపీడనం ఏర్పడనుందని.. దీని ప్రభావంతో బుధ, గురువారాలలో దక్షిణ కోస్తా ప్రాంతంలో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Sponsored