ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీపై సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పొలిటికల్ ఎంట్రీపై మీడియా ప్రతినిధులకు క్లారిటీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రం నుంచి తనకు టికెట్ ఆఫర్ వచ్చిందని.. కానీ తాను అంత ఇంట్రెస్ట్‌గా లేనని చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని సంకేతాలు పంపారు. అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపైనా స్పందించారు సుమన్.
ఏపీ రాజకీయాల్లోకి వస్తానంటున్న వెటరన్ హీరో.. ఆ ఇద్దరు నేతలకు అందరూ మద్దతు పలకాలంటూ!
Published on: 06-08-2025