ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో ఆన్‌లైన్ రమ్మీ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు అధికారులు ఆయనను ప్రశ్నించారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి కూడా రానున్న రోజుల్లో ఈడీ విచారణకు హాజరుకానున్నారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.