పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం గురువారం విడుదల కానుండగా, బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు జరిగాయి. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ సినిమా రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. విడుదలకి ముందే పవన్ కళ్యాణ్ సినిమా కథను రివీల్ చేశారు. కులీ కుతుబ్ షా ఆదేశానుసారం వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి ఢిల్లీలోని ఎర్రకోటకు చేరుకోవడంతో మొదటి భాగం ముగుస్తుందని ఆయన తెలిపారు. ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.