సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. నాలుగేళ్లుగా తాను తన సొంత ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నట్లు.. నరకాన్ని చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా ఆమె విడుదల చేసిన వీడియోలో తనకున్న ఆరోగ్య సమస్యతో పాటు.. తాను ఎదుర్కొంటున్ సమస్యల్ని ఏకరువు పెట్టి.. .భోరున విలపించారు. తనకు సాయం చేయాలని అర్ధించారు. ఇప్పటికే తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోలీసుల్ని ఆశ్రయించినట్లుగా పేర్కొన్నారు.
సొంతిట్లోనే వేధింపులు..నాలుగేళ్లుగా నరకం.. బాలీవుడ్ నటి కన్నీటి వేదన
Published on: 24-07-2025