మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్ గతంలోనే వెల్లడించారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసి ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్‌హాసన్ త్వరలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పుకొచ్చారు. జూలై 25న రాజ్యసభ సభ్యులుగా ఆ బాధ్యతలు స్వీకరిస్తారని మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్ పేర్కొన్నారు.గత లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీ... డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే.
తమిళరాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ న్యూస్.....ఈనెల 25న కమల్‌హాసన్ ప్రమాణ స్వీకారం
Published on: 17-07-2025