సిట్

సిట్ విచార‌ణ వేళ సాయి రెడ్డి ట్వీట్.. ఇప్పుదెందుకు ఇది..?

Published on: 12-07-2025

ఏపీ పాలిటిక్స్ లో సెన్సేషన్ గా మారిన లిక్కర్ స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ మాజీ నేత‌ విజయసాయిరెడ్డికి నిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో సాయి రెడ్డి విచారణకు హాజరయ్యారు. గ‌త‌ ఏప్రిల్ 18న సాయి రెడ్డిని సిట్ అధికారులు మొద‌టిసారి విచారించారు. ఇప్పుడు రెండోసారి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి విచార‌ణ‌లో విజయసాయిరెడ్డి ఎటువంటి విషయాలను బయటపెడతారో అని వైసీపీ నేతలు గుబులుగా ఉన్నారు.

Sponsored