జపాన్ టెక్ దిగ్గజం Sony గ్లోబల్ మార్కెట్లలో WF-1000XM6 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లను విడుదల చేసింది. ఇవి WF-1000XM5కు అప్‌గ్రేడ్‌గా వస్తూ, నాలుగు మైక్రోఫోన్లతో 25% వరకు మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) అందిస్తాయని కంపెనీ చెబుతోంది. సాధారణ వినియోగంలో 8 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుందని పేర్కొంది. ప్లాటినమ్ సిల్వర్, బ్లాక్ రంగుల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో ధర, లభ్యత వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.