ముంబై

ముంబై టీచర్ రూబల్ నాగీకి గ్లోబల్ టీచర్ ప్రైజ్

Published on: 📅 06 Feb 2026, 10:57

ముంబైకి చెందిన ఉపాధ్యాయురాలు రూబల్ నాగీ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఈ అవార్డుతో పాటు 10 లక్షల డాలర్లు నగదు బహుమతి అందుకున్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్‌లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా మురికివాడల్లో 800కి పైగా లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్యను చేరువ చేశారు. గోడలపై చిత్రాల ద్వారా పాఠాలు బోధిస్తూ సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం ఆమె ప్రత్యేకత.

Sponsored