ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ₹1.40 లక్షల కోట్ల విలువైన NH పనులను 2029 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓడరేవులు, ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించేలా రోడ్డు నెట్‌వర్క్ అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న ₹42,194 కోట్ల పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలన్నారు. రాజధానిని కలుపుతూ BLR–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు 2027కల్లా ముగించాలని, ఖరగ్‌పూర్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు DPRలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు