తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన కవిత, ఇప్పుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పార్టీ పేరు, గుర్తుపై స్పష్టతకు వచ్చిన ఆమె, ‘తెలంగాణా ప్రజా జాగృతి’ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సెంటిమెంట్‌గా భావిస్తున్న ‘జాగృతి’ పేరును కొనసాగించాలని నిర్ణయించిన కవిత, ఉగాది నాటికి పార్టీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.