ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు 5 విడతల్లో, రంగారెడ్డి జిల్లాలోని 525 మంది సర్పంచులు 5 రోజుల పాటు శిక్షణ పొందనున్నారు. వారికి గ్రామ పంచాయతీ పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని రెండు సమావేశ మందిరాలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు, పూర్తి స్థాయి శిక్షణను నిర్వహిస్తారు.