సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఇటీవల నిర్మించిన నూతన గద్దెలను పునఃప్రారంభించారు. అనంతరం మనవడితో కలిసి నిలువెత్తు బంగారం సమర్పించారు. సీఎమ్ సతీమణి, కూతురు, అల్లుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దావోస్ పర్యటనకు బయల్దేరి, అధికార కార్యక్రమాలు సజావుగా, విజయవంతంగా పూర్తయ్యాయి.