ఇనుకుకు

ఇనుకుకు దారి లేదని.. దాహం తీర్చే ట్యాంకులను ఎత్తుకొచ్చారు

Published on: 07-11-2025

నిజామాబాద్ జిల్లా పాఠన్‌గల్ మండలం కొడిచెర్ల గ్రామం సమీపంలోని మంజీరా నది నుండి కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా నది నీటి ప్రవాహంలో, ఇసుక తరలించే మార్గం తెగిపోయింది. దీంతో, ఇసుకకు దారి లేదని అక్రమార్కులు వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలోని నాలుగు మినీవాటర్ ట్యాంకులను దొంగిలించి, వాటిని ట్రాక్టర్‌తో నది పక్కకు తరలించి, ప్రవాహంలో అడ్డంగా పెట్టి, వాటిపై మట్టిపోసి తాత్కాలికంగా దారిని నిర్మించుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Sponsored