కృష్ణా

కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన అట్టర్‌ఫ్లాప్: మంత్రి కొల్లు రవీంద్ర

Published on: 05-11-2025

మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్‌ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్ పర్యటనలో ఎక్కడా రైతులు కనిపించలేదని ఆయన అన్నారు. ఒక పక్క గ్రామాల నుండి రైతులను తీసుకొచ్చి పబ్లిసిటీ కోసం పెట్టారని ఆరోపించారు. తూఫాను తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ మాట్లాడిన మాటల్లో ఎక్కడా నిజం లేదని, కేవలం ప్రభుత్వంపై బురదజల్లడానికే ప్రయత్నించారని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.

Sponsored