West Bengalలో నిపా వైరస్ కారణంగా తొలి మృతి గురువారం నమోదైంది. నార్త్ 24 పరగణాల జిల్లా బరాసత్లోని ఓ ఆసుపత్రి క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న నర్సు మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆమెకు ఊపిరితిత్తుల్లో సెకండరీ ఇన్ఫెక్షన్ ఏర్పడినట్టు వెల్లడించారు. ఇదే ఆసుపత్రిలో మరో నర్సు చికిత్స పొందుతోంది. ఇద్దరే రాష్ట్రంలో నిపా ప్రభావితులని, వారి సంప్రదింపుల్లో ఉన్నవారందరి నమూనాలు పరీక్షించగా అన్నీ నెగటివ్‌గా తేలినట్టు అధికారులు తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు