టి20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో నేడు రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం పల్లెకెలెలో ఇంగ్లండ్-శ్రీలంక తలపడగా, రాత్రి అహ్మదాబాద్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య హై వోల్టేజ్ పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రూప్ దశలో అజేయంగా దూసుకెళ్లిన సూర్యసేన అదే జోష్‌తో బరిలోకి దిగుతోంది. అహ్మదాబాద్ గడ్డపై భారత బ్యాటర్లు ఎలా మెరుస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సౌతాఫ్రికా బౌలింగ్‌కు భారత్ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.
సూపర్-8లో నేడు డబుల్ డోస్… భారత్-సౌతాఫ్రికా హై వోల్టేజ్ పోరు
Published on: 📅 22 Feb 2026, 06:36