ప్రైవేటు

ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ సీట్లకు నోటిఫికేషన్ విడుదల

Published on: 📅 07 Feb 2026, 09:17

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లాటరీ విధానంలో మార్చి 25, ఏప్రిల్ 12న సీట్లు కేటాయిస్తారు. అనాథలు, దివ్యాంగులు, హెచ్ఐవీ బాధితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించనున్నారు.

Sponsored