మెర్సిడెస్-బెంజ్ తన తాజా ప్రొడక్ట్ వ్యూహంలో భాగంగా కొత్త AMG GLC 53ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది బ్రాండ్ నుంచి రాబోయే ఇన్లైన్ సిక్స్-సిలిండర్ మోడళ్లలో తొలి కారు కావడం విశేషం. ఇప్పటికే AMG చీఫ్ మైకేల్ షీబే ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు. అధిక పనితీరు కలిగిన ఆరు సిలిండర్ ఇంజిన్లపై దృష్టి పెట్టిన లైనప్‌ను మెర్సిడెస్ రూపొందిస్తోంది. 2027 మోడల్ ఇయర్‌కు ఈ AMG GLC 53 మార్కెట్లోకి రానుంది. పనితీరు, లగ్జరీ సమ్మేళనంతో ఇది ఆటో రంగంలో ఆసక్తిని రేపుతోంది.