సుప్రీంకోర్టులో

సుప్రీంకోర్టులో మమత హాజరుపై అభ్యంతరం… పిటిషన్ దాఖలు

Published on: 📅 09 Feb 2026, 06:17

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించడం రాజ్యాంగ విరుద్ధమని, చట్టపరంగా సరికాదని ఆరోపిస్తూ ఓ అప్లికేషన్ దాఖలైంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశంలో ఫిబ్రవరి 4న మమత సుప్రీంకోర్టులో వాదించిన తొలి సిట్టింగ్ సీఎం అయ్యారు. ఈ వ్యవహారంపై అఖిల భారత హిందూ మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ అగర్వాల్ ఈ అప్లికేషన్ దాఖలు చేశారు. SIR‌కు సంబంధించిన పిటిషన్లను సోమవారం ధర్మాసనం విచారించనుంది.

Sponsored