లక్నోలో వృత్తి, చదువు విషయాలపై తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారితీసింది. 21 ఏళ్ల అక్షత్ ప్రతాప్ సింగ్ తన తండ్రి మన్వేంద్ర సింగ్‌ను రైఫిల్‌తో కాల్చి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. వైద్య విద్య చదవాలని తండ్రి ఒత్తిడి చేయడంతో తరచూ వాగ్వాదాలు జరుగుతున్నట్లు సమాచారం. శుక్రవారం మరోసారి గొడవ చెలరేగడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి కొంత భాగాన్ని బయట పారేసి, మిగిలిన భాగాలను ఇంట్లోని డ్రమ్ములో దాచిపెట్టాడు. నిందితుడు నేరాన్ని ఒప్పుకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.