IND–US

IND–US ఇంటరిమ్ ట్రేడ్ డీల్‌తో వికసిత్ భారత్‌కు బలం: గోయల్

Published on: 📅 07 Feb 2026, 09:28

IND–US ఇంటరిమ్ వాణిజ్య ఒప్పందంతో వికసిత్ భారత్ దిశగా దేశం కీలక అడుగు వేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందంతో గ్రామీణ ప్రజల జీవనోపాధికి భరోసా లభించిందన్నారు. మొక్కజొన్న, సోయా, పాలు, పౌల్ట్రీ, ఇథనాల్, టొబాకో, కూరగాయలు, మాంసం వంటి రంగాలు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు వ్యాపారాభివృద్ధిని ప్రోత్సహిస్తూ, భారత్–అమెరికా మధ్య ఆర్థిక సహకారాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుందని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.

Sponsored