ప్రేమికుల రోజు సందర్భంగా Google ప్రత్యేక డూడుల్‌తో శుభాకాంక్షలు తెలిపింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డేను ఈసారి చేతితో చేసిన గిఫ్టులు, ప్రేమలేఖలు, స్వీట్ ట్రీట్స్‌తో ఆకర్షణీయంగా చూపించింది. యూకే, భారత్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఈ డూడుల్ ప్రత్యక్షమైంది. 1998లో ల్యారీ పేజ్, సెర్గే బ్రిన్ రూపొందించిన తొలి డూడుల్ నుంచి గూగుల్ అనేక ప్రత్యేక సందర్భాలను గుర్తు చేస్తూ వస్తోంది. ప్రేమను వ్యక్తపరిచే చిన్న బహుమతులే ఈ రోజు అసలైన ప్రత్యేకత అని డూడుల్ సందేశం తెలిపింది.