రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగనుంది. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు భూమి పూజ నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించి రైతులు, విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే క్వాంటం శిక్షణ కోసం 50 వేల మంది నమోదు చేసుకున్నారు