IPOకు

IPOకు ముందే xAIలో భారీ మార్పులు.. మస్క్ కీలక పునర్వ్యవస్థీకరణ

Published on: 📅 12 Feb 2026, 06:07

ఎలాన్ మస్క్ తన AI సంస్థ xAIలో కీలక మార్పులు చేపట్టారు. స్పేస్‌ఎక్స్‌తో విలీనానికి, భారీ IPO ప్రణాళికలకు ముందుగా సంస్థను నాలుగు ప్రధాన విభాగాలుగా పునర్వ్యవస్థీకరించారు. ముగ్గురు కో-ఫౌండర్లు రాజీనామా చేయడంతో స్థిరత్వంపై చర్చలు మొదలయ్యాయి. ChatGPT, గూగుల్ జెమినీతో పోటీలో భాగంగా గ్రోక్ మోడల్, కోడింగ్ టూల్స్‌పై దృష్టి పెట్టనున్నట్లు మస్క్ తెలిపారు. ఒక మిలియన్ Nvidia H100 GPU సమాన సామర్థ్యంతో ట్రైనింగ్ క్లస్టర్‌ను ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాదిలోనే పబ్లిక్ ఆఫర్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Sponsored