ఏప్రిల్

ఏప్రిల్ 10 నుంచి 1–9 తరగతులకు వార్షిక పరీక్షలు.. 24 నుంచి వేసవి సెలవులు

Published on: 📅 23 Feb 2026, 03:10

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 వార్షిక పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 20న ముగుస్తాయి. ప్రతి రోజూ నిర్వహించే పరీక్షల సమాధాన పత్రాలను అదే రోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల మార్కులను ISMS పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఏప్రిల్ 23న ఫలితాలను విడుదల చేయనుండగా, అదే రోజు పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

Sponsored